Header Banner

గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మరోసారి అడ్డంగా బుక్కైన స్టార్ హీరో! అసలేం జరిగిందంటే?

  Sun May 11, 2025 16:19        Cinemas

కోలీవుడ్‌లో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందిన హీరో జయం రవి. అయితే ఇటీవలే తన పేరును రవి మోహన్ గా పిలవాలంటూ లేఖ కూడా రిలీజ్ చేశారు. తని ఒరువన్, బోగన్, అదంగ మారు, పోన్మగళ్ వందాల్, పొన్నియన్ సెల్వన్ హిట్ చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఈ హీరో.. ప్రస్తుతం తన సినిమాలకన్నా వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

 

ముఖ్యంగా తెలుగులో తని ఒరువన్ సినిమాను రామ్ చరణ్ ధృవ పేరుతో చేయడంతో ఆయనకు తెలుగులోను మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగులో మాస్-క్లాస్ ప్రేక్షకులకు ఆయన పాత్రలు బాగా కనెక్ట్ అయ్యాయి. అయితే తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించిన నాటి నుంచి ఆయనపై విమర్శలు వస్తున్నాయి. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఈ దంపతులు విడిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

 

ఇది కూడా చదవండి: మృణాల్‌తో పెళ్లి రూమర్స్‌కు సుమంత్ ఫుల్‌స్టాప్..! సీక్రెట్ డేటింగ్‌పై క్లారిటీ!

 

కానీ గత కొంతకాలంగా రవి మోహన్.. సింగర్ కేనిషాతో రిలేషన్ లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా డైరెక్టర్ గణేష్ కుమార్తె పెళ్లికి ఇద్దరూ కలిసి హాజరవ్వడం, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావడంతో వీరి రిలేషన్‌పై మరింత స్పష్టత వచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై వారిద్దరిలో ఎవరో ఒకరు ఓపెన్ అయ్యి అసలు విషయం రివీల్ చేసే వరకు వీరి రిలేషన్ పై ఓ క్లారిటీ రాదని అంటున్నారు.

 

మరోవైపు రవి కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బొంబ్లి, సిరెన్, తని ఒరువన్ 2 వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే వ్యక్తిగత జీవితంలో వివాదాలు వెంటాడుతుండటంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి.

 

ఇది కూడా చదవండిచిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #JayamRavi #RaviMohan #ThaniOruvan #JayamRaviDivorce #SingerKanishaa #JayamRaviControversy #TollywoodNews